గని అంథెం కి 2.5 మిలియన్ వ్యూస్!

గని అంథెం కి 2.5 మిలియన్ వ్యూస్!

Published on Oct 29, 2021 6:09 PM IST

వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం ను డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఇప్పటికే ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి గని అంతెం విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పాట వైరల్ కాగా, యూ ట్యూబ్ లో సైతం మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు ఈ పాట కి 2.7 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు