రికార్డు వసూళ్లతో సెన్సేషనల్ ఫీట్ అందుకున్న “2018” చిత్రం.!

Published on Jun 10, 2023 12:05 pm IST

రీసెంట్ గా మళయాళ సినిమా నుంచి వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రం “కేరళ 2018”. మరి మాలీవుడ్ లో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఏ మళయాళ సినిమా కూడా అందుకోని భారీ రెస్పాన్స్ అయితే అందుకుంది. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సాలిడ్ వసూళ్లు అందుకోగా రీసెంట్ గా ఓటిటి లో కూడా వచ్చినప్పటికీ వరల్డ్ వైడ్ గా కూడా అదిరే వసూళ్లు అయితే కొనసాగిస్తోంది.

మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 200 కోట్ల మార్క్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సెన్సేషనల్ ఫీట్ అందుకున్న మొట్టమొదటి మళయాళ చిత్రంగా అయితే 2018 ఇప్పుడు రికార్డులకెక్కింది. ఇప్పుడు సోనీ లివ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ఈ చిత్రం ఇలాంటి రన్ ని కొనసాగిస్తూ ఉండడం విశేషం. ఇక ఈ చిత్రంలో తొవినో థామస్, అపర్ణ బాలమురళి తదితరులు కీలక పాత్రల్లో నటించగా జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :