మహా సముద్రం ట్రైలర్ కి భారీ రెస్పాన్స్…5 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది!

Published on Sep 24, 2021 4:54 pm IST

శర్వానంద్ హీరోగా, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను అమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. అజయ్ భూపతి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం ను అక్టోబర్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్ ఇప్పటి వరకు యూ ట్యూబ్ లో 5 మిలియన్ కి పైగా వ్యూస్ ను సాధించడం జరిగింది. ఇప్పటికే ఈ ట్రైలర్ పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :