“సర్కారు వారి పాట” నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోందా?

Published on Jan 25, 2022 9:00 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ చిత్రాన్ని మహేష్ కెరీర్ లోనే మరో మైలు రాయిగా నిలిచిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

అందుకే మహేష్ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా కాస్త బ్యాలన్స్ ఉండగా దానిని మేకర్స్ కాస్త నెమ్మదిగానే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఈ సినిమాపై ఓ క్రేజీ టాక్ ఇప్పుడు ప్రచారం అవుతుంది.

ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ని మేకర్స్ అతి త్వరలో రివీల్ చెయ్యబోతున్నారట. మరి అది కూడా బహుశా సినిమా ఫస్ట్ సింగిల్ కోసమే అయ్యుంటుందని తెలుస్తుంది. మరి మరోపక్క ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా ఏమన్నా క్లారిటీ ఏమో అని కూడా అనిపిస్తుంది. మరి వేచి చూడాలి మేకర్స్ రివీల్ చేసే ఆ క్రేజీ అప్డేట్ ఏంటో అన్నది.

సంబంధిత సమాచారం :