“గుంటూరు కారం” నుంచి నెక్స్ట్ భారీ షెడ్యూల్.!

Published on Jun 6, 2023 3:02 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం”. మరి ఫస్ట్ గ్లింప్స్ తో అదిరే రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం షూటింగ్ కాస్త స్లో గానే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే సాఫీ గానే మేకర్స్ కంప్లీట్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు అయితే మేకర్స్ ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ జూన్ 12 నుంచి అయితే ఈ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుండగా చాలా లెంగ్తీ షెడ్యూల్ గా అయితే దీనిని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనితో అయితే ఆగస్ట్ లో మహేష్ బర్త్ డే కి కావాల్సిన అదిరే టీజర్ అయితే సిద్ధం అయిపోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :