సల్మాన్ భాయ్ ‘కిక్’ రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ఆగడు’

Published on Sep 20, 2014 1:00 pm IST

Aagadu-wallpapers
ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలకు ఎంత మంచి కలెక్షన్స్ వచ్చిన మనకన్నా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకు వస్తుంటాయి. కానీ మొదటిసారి ఓ తెలుగు సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఆ సినిమానే మహేష్ బాబు నటించిన ‘ఆగడు’. ఆగడు సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ షోస్ తో రికార్డ్ కలెక్షన్స్ సాధించిందని ఇది వరకూ తెలియజేశాము.

తాజాగా మాకు అందిన ఓవర్సీస్ పూర్తి కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం ఆగడు ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ వరకే 5.81 లక్షల యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ప్రీమియర్ షోస్ పరంగా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. కానీ నిన్నటితో ఆగడు సినిమా ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసి యుఎస్ లో తెలుగు సినిమా స్టామినాని చాటింది.

మహేష్ బాబు డిఫరెంట్ స్టైల్ నటన, తమన్నా గ్లామర్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఆగడు ఒక్క ఓవర్సీస్ లోనే కాకుండా ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :