త్వరలో కేరళ వెళ్లనున్న ‘ఆగడు’ టీం

Published on Jun 12, 2014 8:16 am IST

Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే పలు కీలక సీన్స్ షూట్ చేసిన ఈ చిత్ర టీం మరి కొద్ది రోజుల్లో శృతి హాసన్ పై వచ్చే ఓ ఐటమ్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. ముంబై షెడ్యూల్ పూర్తయ్యాక ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం కేరళ వెళ్లనున్నారు.

ఇటీవలే విడుదల చేసిన ఈ ‘ఆగడు’ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా యు ట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం :