ఏప్రిల్ నుండి గుజరాత్ లో ‘ఆగడు’ షూటింగ్

Published on Mar 12, 2014 8:56 am IST

Mahesh_Babu01
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి గుజరాత్ లో జరగనుంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ సభ్యులు అక్కడ జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసున్నారు. అలాగే దానితో పాటుగా హైదరాబాద్ లో జరగనున్న షూటింగ్ కొరకు కూడా వారు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల చివర్లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నాహీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 2011లో హిట్ సాదించిన ‘దూకుడు’ సినిమాకి పనిచేసిన అదే టీం పనిచేస్తోంది. మహేష్ బాబు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా 2014 సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :