23 నుంచి బళ్ళారికి వెళ్లనున్న ‘ఆగడు’

Published on Feb 17, 2014 8:15 am IST

Aagadu-Movie
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 23 నుంచి మరో షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం బళ్ళారికి షిఫ్ట్ అవ్వనున్నారు. ముందుగా గుజరాత్ లో చేయ్యాలనుకున్నారు కానీ చివరికి బళ్ళారికి షిఫ్ట్ అయ్యింది.

మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమన్నా పాత్ర పూర్తి మాస్ గా ఉంటుంది. ‘ఆగడు’ కి శ్రీను వైట్ల డైరెక్టర్ కావడం వల్ల సినిమాలో కచ్చితంగా సూపర్బ్ కామెడీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని ఎంఆర్ వర్మఎడిటర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :