రిపబ్లిక్ డే కోసం అమీర్ ఖాన్ కొత్త సినిమా !

Published on Dec 31, 2018 3:57 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన శైలిలో చిత్రాలని రూపొందిస్తారు. తాజాగా స్టార్ ప్లస్ తో కలిసి అమీర్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆయన నిర్మించిన చిత్రం ‘రూబరు రోషిణి’.

కాగా ఈ చిత్రాన్ని 2019 గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా టీవీ ప్రీమియర్ల ద్వారా ప్రదర్శించనున్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా ఇదే తాను ప్రేక్షకుల కోసం చేసిన ప్లాన్ అని అమీర్ స్పష్టం చేశారు.

ఇక అమీర్ నటించిన పిరియాడికల్ మూవీ థగ్స్ అఫ్ హిందుస్థాన్ గత నెల 8న విడుదలై నెగిటివ్ టాక్ తో ప్లాప్ సినిమాల జాబితాలో చేరింది. కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, ఫాతిమా సన షేక్ వంటి స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయారు.

సంబంధిత సమాచారం :