మరింత పెద్దగా ప్లాన్ చేస్తున్న “ఆచార్య”

Published on Oct 13, 2021 11:38 pm IST


కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. భారీ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన వరుస అప్డేట్స్ షురూ కానున్నాయి.

ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా కాకపోయినప్పటికీ, హిందీ లో భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ లో కూడా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా తరహా లో సినిమా ను ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ లోపే మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లతో ముందుగానే భారీగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :