లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న ప్రముఖ నటుడు !

Published on Jan 1, 2019 11:12 am IST

గత కొంత కాలంగా రాజకీయాల పై తనదైన శైలిలో తన గొంతుకను వినిపిస్తోన్న ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఓ సంచలన ప్రకటన చేశారు. రాబొయ్యే లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు.

ప్రకాష్ రాజ్ పోస్ట్ చేస్తూ.. ”ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజల గొంతుని పార్లమెంట్ లో వినిపించడానికి.. మీ అందరి సపోర్ట్ తో నేను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను” అని ఆయన పోస్ట్ చేశారు.

ఇక ప్రకాష్ రాజ్ ఇప్పటికే తెలంగాణాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని, ఆ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More