లేటెస్ట్..కోవిడ్ నుంచి బయటపడ్డ విలక్షణ నటి.!

Published on Jul 22, 2022 2:03 pm IST


గత కొన్ని రోజులు కితమే సౌత్ ఇండియా స్టార్ నటి అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ తాను కోవిడ్ పాజిటివ్ అయ్యానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో కరోనా ఇంకా వెళ్లిపోలేదని అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని రీసెంట్ గా తనని కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేసుకోవాలని సూచించింది. అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ టెస్ట్ చేయించుకోగా కరోనా నెగిటివ్ అయ్యినట్టుగా లేటెస్ట్ న్యూస్ ని ఆమె షేర్ చేసుకుంది.

తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలిపింది. దీనితో ఆమె ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక నుంచి మళ్ళీ ఆమె తన ప్రాజెక్ట్స్ కి రెడీ కానుంది అని చెప్పాలి. మరి ప్రస్తుతం అయితే తమిళ్ సహా తెలుగులో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తుండగా మన తెలుగులో బాలయ్య తో ఓ సినిమా అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ భారీ సినిమా హను – మాన్ చిత్రంలో కీలక పాత్రలు తాను చేస్తుంది.

సంబంధిత సమాచారం :