ఒక్క పందిపిల్ల కోసం 150 పందిపిల్లలను పెంచారట !

Published on Sep 9, 2018 12:27 pm IST

నటుడు మరియు దర్శక నిర్మాత అయిన రవిబాబు దర్శకుడిగా సుదీర్ఘమైన విరామం తర్వాత తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’ ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే నెటిజన్లు కూడా ఈ చిత్ర ట్రైలర్ ను షేర్ చేస్తూ.. ఈ చిత్రం పై ఇంకా అంచనాలను పెంచేశారు. రెండున్నర సంవత్సరాలు పాటు రవిబాబు ఈ చిత్రాన్ని కష్టపడి రూపొందించినందుకు చివరకు ఫలితం దక్కేలానే ఉంది. కాగా ఈ సినిమా మొత్తం బంటి అనే ఒక పందిపిల్ల చుట్టూ కేంద్రీకృతమై ఉండటం, విఎఫ్ఎక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో చిత్రం కూడా బాగా వచ్చిందట.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తెరెకెక్కించే క్రమంలో పందిపిల్ల(బంటి)ని చూపించడానికి మొత్తం 150 పందిపిల్లలను పెంచారట. దీనికి కారణం పందిపిల్లలు చాలా వేగంగా పెరుగుతుండటం ద్వారా, కొన్ని రోజుల్లోనే వ్యత్యాసం కనిపిస్తోంది. దాంతో రవిబాబు 150 పందిపిల్లలను ఉపయోగించి సినిమాని తీసారని సమాచారం.

లైవ్ యాక్ష‌న్ త్రీడీ సాంకేతిక‌తో రోపొందిన ఈ చిత్రం ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది. రవిబాబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :