టాక్..అప్పుడే భారీ మొత్తంలో రాబట్టేసిన “ఆదిపురుష్”.?

Published on Jun 3, 2023 11:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్”. నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రభాస్ అభిమానులు సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాకి ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని లెవెల్ బిజినెస్ జరగగా ఈ రికార్డు బిజినెస్ సెన్సేషన్ గా అయితే మారింది.

ఇక లేటెస్ట్ గా అయితే మరో ఇంట్రెస్టింగ్ బజ్ బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ సినిమా నిర్మాతల ఓన్ రిలీజ్ మినహా ఈ చిత్రం తెలుగు హక్కులు నాన్ థియేట్రికల్ హక్కులతో అయితే ఏకంగా 400 కోట్ల మేర బిజినెస్ ని జరిపినట్టుగా తెలుస్తుంది. దీనితో లో ఆల్రెడీ చాలా మొత్తం జస్ట్ ఈ హక్కులతోనే వచేశాయని అంటున్నారు. ఇక రిలీజ్ అయ్యాక వసూళ్ల రూపంలో ఆదిపురుష్ ఎంత రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :