లేటెస్ట్ : ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ కోసం భారీ ప్లానింగ్ ?

Published on Feb 20, 2023 8:16 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా సినిమా ఆదిపురుష్. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో రాఘవగా ప్రభాస్ నటిస్తుండగా సీతగా కృతి, అలానే లంకేశ్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఓం రౌత్ ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫైల్స్ సంస్థలు నిర్మించాయి. తెలుగుతో పాటు పలు భాషల్లో గ్రాండ్ లెవెల్లో ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆదిపురుష్ మూవీ నుండి మరొక స్పెషల్ టీజర్ ని మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక అక్కడి నుండి గట్టిగా ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారని, తెలుగుతో పాటు పలు ఇతర భాషల ప్రమోషన్స్ లో టీమ్ మొత్తం పార్టిసిపేట్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మరింత క్వాలిటీ తో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుపుకుంటున్న ఆదిపురుష్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :