“మేజర్” టికెట్ రేట్స్ పై సాలిడ్ క్లారిటీ ఇచ్చిన శేష్.!

Published on May 22, 2022 8:00 am IST


పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మరో సినిమా “మేజర్ ది ఫిల్మ్”. మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించారు. అయితే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా శేష్ తన సోషల్ మీడియాలో ఒక ఆస్క్ సెషన్ నిర్వహించగా తనకి వచ్చిన ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చాడు.

వాటిలో టికెట్ రేట్స్ కి సంబంధించి ప్రశ్న రాగా దానిపై సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు. మా సినిమాకి ఎలాంటి హైక్స్ ఉండవని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఏవైతే ధరలు ఉన్నాయో వాటితోనే మేజర్ సినిమా రిలీజ్ అవుతుంది అని సాధారణ ప్రేక్షకులకు ఎక్స్ట్రార్డినరీ సినిమా అంటూ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం అందించగా మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ వారు ఈ సినిమాకి నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం ఈ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :