“మేజర్” సినిమా కాదు ఎమోషన్ – అడివి శేష్

Published on May 29, 2022 11:25 pm IST


అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన మేజర్ చిత్రం జూన్ 3, 2022 న థియేటర్ల లో భారీ విడుదల కి సిద్దం అవుతోంది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కి దగ్గర పడుతుండటం తో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక లో హీరో అడివి శేష్ ఎమోషనల్ అవుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు.

మేజర్ ఒక సినిమా కాదు ఎమోషన్, మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ అమర్ రహే అంటూ చెప్పుకొచ్చారు. తనకి ఇంత మంచి ప్లాట్ ఫామ్ ఇచ్చిన సోని పిక్చర్స్ కి థాంక్స్ తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కి, నమ్రత శిరోద్కర్ తో పాటుగా, చిత్రం కోసం పని చేసిన వారికి థాంక్స్ తెలిపారు. ఈ చిత్రం ఎప్పటికీ ఓటిటి రిలీజ్ కాదు, ముందుగా డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ అంటూ మహేష్ బాబు చెప్పిన మాటలు గుర్తు చేశారు. తన గురువు అబ్బూరి రవి కి థాంక్స్ తెలిపారు. క్షణం, గూడాచారి, ఎవరు చిత్రాలకి ఆయన డైలాగ్స్ రాశారు. ఈ చిత్రం వాటికి 10 X ఉంటుంది అని ఆయన అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.

మనకి మార్వెల్ సినిమా కెప్టెన్ అమెరికా ఎందుకు ఉండకూడదు అని చాలా మంది అన్నారు, కానీ మనకి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. అడివి శేష్ మాట్లాడుతున్నంత సేపు ప్రీ రిలీజ్ వేడుక కి వచ్చిన అభిమానులు ఫుల్ జోష్ తో ఉన్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పలు మేమరిస్ మరియు చాలా సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ థియేటర్ల లో సినిమా రిలీజ్ కానుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అడివి శేష్.

సంబంధిత సమాచారం :