“స్క్విడ్ గేమ్” ని తలదన్నేలా నెట్ ఫ్లిక్స్ నుంచి మరో కొరియన్ సిరీస్.!

Published on Nov 16, 2021 4:30 pm IST

ఓటిటి ప్రపంచంలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా చెయ్యనక్కర్లేదు.. ప్రపంచం లోనే అదిరే కంటెంట్ వీరి సొంతం. పైగా ఒకదాన్ని మించి ఒకటి సిరీస్ లతో వస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి వరల్డ్ వైడ్ గా గ్లోబల్ హిట్ అయ్యిన సిరీస్ లలో టాప్ ఉండేది “మనీ హెయిస్ట్”. మరి దీనిని మించి రీసెంట్ గా వచ్చిన కొరియన్ సిరీస్ “స్క్విడ్ గేమ్” భారీ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది.

అయితే కొరియన్ సిరీస్ లకి ఇప్పుడు చాలా క్రేజ్ ఏర్పడింది. అందుకే నెట్ ఫ్లిక్స్ ప్రధాన పోటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కూడా కొరియన్ కంటెంట్ ని తీసుకొస్తున్నారు. మరి ఇదిలా ఉంటే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వారు ఈ స్క్విడ్ గేమ్ సెన్సేషన్ ని మించే ఇంకో కొరియన్ సిరీస్ ని తీసుకు వస్తున్నారు. అదే “హెల్ బౌండ్”.

స్క్విడ్ గేమ్ కి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అదిరే విజువల్స్ తో ఈ సిరీస్ కనిపిస్తుంది. ఓటిటి వర్గాల్లో అయితే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి అంతే కాకుండా స్క్విడ్ గేమ్ రికార్డ్స్ ఇది బ్రేక్ చేస్తుంది అని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఇంత క్రేజ్ లో ఉన్న ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ వారు ఈ నవంబర్ 19 న స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. మరి ఇదెలా ఉంటుందో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More