కృష్ణా జిల్లాలో ‘అజ్ఞాతవాసి, జై సింహా’ వసూళ్ల వివరాలు !

పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకూ డీలా పడిపోతోంది. మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పండుగ మూడు రోజుల్లో కాస్త కూస్తో నెట్టుకొచ్చిన ఆ తర్వాత మెల్లగా తగ్గిపోయింది. 9వ రోజు కృష్ణా జిల్లాలో కేవలం రూ.3.22 లక్షల షేర్ మాత్రమే రాబట్టిన ఈ చిత్రం మొత్తంగా రూ.3.22 కోట్లకు చేరుకుంది. దీంతో ఆధిక ధర వెచ్చించి కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా లేవు.

ఇక మరొక పెద్ద సినిమా ‘జై సింహ’ 7వ రోజు రూ.5.9 లక్షల షేర్ తో మొత్తంగా రూ. 1.5 కోట్లను రాబట్టి లాభాల దిశగా వెళుతుండగా సూర్య చిత్రం ‘గ్యాంగ్’ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ రూ.4.15 లక్షల షేర్ తో మొత్తంగా రూ.46.72 లక్షల షేర్ ను నమోదుచేసింది.