త్వరలో అజ్ఞాతవాసి ట్రైలర్ విడుదల !

పవన్ నటించిన 25 సినిమా అజ్ఞాతవాసి జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాంగ్స్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బారిగా పెరిగాయి. అను ఇమ్మానుల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను హారికా హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పాడిన కొడకా కోటేశ్వర రావ్ పాటను ఈ నెల 31 న విడుదల చెయ్యబోతున్నారు.

తాజా సమాచారం మేరకు జనవరి 5న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి కథ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు’. అలాగే ఖుస్బు చేసిన రోల్ సినిమాకు హైలెట్ అని తెలుస్తోంది.