అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేసిన అజిత్ !


2017లో శివ దర్శకత్వంలో అజిత్ నటించిన చిత్రం ‘వివేగం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాను ఇటీవల ‘వీర్’ పేరుతో హిందీ భాషలోకి అనువదించారు. అక్కడ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో కూడ విడుదల చేశారు .

యు ట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లోపే 8 మిల్లియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. హిందీ లో డబ్ అయిన సౌత్ సినిమాకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. ఇంతకుముందు అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రం 54,80,000 వ్యూస్ ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు అజిత్ ‘వివేగం’ ఆ రికార్డుని క్రాస్ చేసింది .