అక్టోబర్ 29 న ఆకాష్ ‘రొమాంటిక్’ !

Published on Oct 18, 2021 5:00 pm IST

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రొమాంటిక్’ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో ఈ చిత్రం రాబోతుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి తన కుమారుడు కోసం ఈ రొమాంటిక్ కి కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ లను అందించాడు. ఇక ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, నరేష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :