సింహాచలం సింహాద్రి అప్పన్నని దర్శించుకున్న అఖండ టీమ్!

Published on Dec 9, 2021 12:00 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన అఖండ చిత్రం విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా అఖండ చిత్ర యూనిట్ నేడు సక్సెస్ సెలబ్రేషన్స్ ను మొదలు పెట్టడం జరిగింది.

వైజాగ్ లో ఈ సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. నేడు అఖండ టీమ్ సింహాచలం సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో లు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఖండ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ నేడు సాయంత్రం వైజాగ్ లో మొదలు కానున్నాయి. ఈ చిత్రం లో బాలయ్య సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించగా, శ్రీకాంత్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :