అఖిల్ తో చేయబోయే సినిమా క్యూట్ లవ్ స్టోరీగా ఉండదంటున్న వర్మ !

28th, March 2018 - 10:52:07 AM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న రాత్రి అఖిల్ తో చేయబోయే సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగార్జునతో ‘శివ’ లాంటి సినిమా చేసిన వర్మ అఖిల్ తో సినిమా చేస్తున్నారనగానే సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. వర్మ మాత్రం ఈ సినిమా క్యూట్ లవ్ స్టోరీగా ఉండదని క్లారిటీ ఇచ్చేశారు

అలాగే సినిమా మొత్తం ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని, అందులో బలమైన లవ్ స్టోరీ కూడ ఉంటుందని, వయోలెన్స్, ప్రేమ కలిసి ఉంటాయని అన్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఒక సినిమాను మొదలుపెట్టనున్న అఖిల్ అది పూర్తవగానే వర్మ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు.