రేపేదో విశేషాన్ని బయటపెట్టనున్న అఖిల్ !
Published on Dec 5, 2017 6:10 pm IST

అక్కినేని అఖిల్ చేస్తున్న రెండవ సినిమా ‘హలో’ పై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిన సంగతే. ఈ చిత్రంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారంతా. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇటీవలే విడుదలై భారీ స్పందనను దక్కించుకుంది. ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమాకు సంబందించిన ఒక విశేషాన్ని రేపు లాంచ్ చేస్తానంటూ కొద్దిసేపటి క్రితమే తెలిపారు అఖిల్.

ఈ విశేషం ఎక్కువ భాగం ఆడియో గురించే ఉండనుంది. ఈ సమాచారంతో పాటే సినిమా ఆడియో ఫైనల్ మిక్స్ ఇప్పుడే పూర్తైందని, పాటల్ని ప్రేక్షకులకి వినిపించడానికి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని కూడా అఖిల్ అన్నారు. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook