పాట హృదయం చెదిరిపోయింది – అక్కినేని నాగార్జున

Published on Dec 1, 2021 3:30 pm IST

ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తో టాలీవుడ్ విషాదం లో మునిగింది. మహ ప్రస్థానం లో చివరిసారి గా చూసేందుకు అభిమానులు, ప్రముఖులు భారీగా తరలి వస్తున్నారు. అక్కినేని నాగార్జున సీతారామశాస్త్రి గారిని చివరి సారి గా చూసి, నివాళి అర్పించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదిక గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి గౌరవసూచకంగా బంగార్రాజు నాకోసం అనే టీజర్ ను నేడు కాకుండా, రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :