సమంత ‘శూర్పణక’గా మారనుందా ?

Published on Oct 22, 2018 3:17 pm IST


రామాయణంలో శూర్పణఖది చాలా కీలకమైన పాత్ర. రావణాసురుడిని రాముని పై ఉసిగొల్పి రామ – రావణ యుద్దానికి ప్రధాన కారణమైన వ్యక్తి శూర్పణక. మరి అలాంటి శూర్పణఖ పాత్రను ప్రధానాంశంగా తీసుకొని ఓ సినిమా చేయబోతున్నానని గతంలోనే యానిమేషన్ డైరెక్టర్ భార్గవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా శూర్పణఖ పాత్రలో మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నాడు భార్గవ్. కథ కూడా రెడీ అయింది. కానీ, ఇప్పుడు కాజల్ బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భార్గవ్ సమంతను సంప్రదించారట. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న సమంత.. ఈ సినిమా ఒప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక శూర్పణఖ రావణ సోదరి అని, ఓ రాక్షసి అని తప్ప.. ఆమె గురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు. కానీ శూర్పణక ఓ అందమైన యువరాణి అట. ఈ సినిమాలో శూర్పణక గురించి ఎవరకి తెలియని విషయాలు కూడా చూపించనున్నారు. ఐతే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :