ఏ సినిమా బిగ్ స్క్రీన్ వద్దకి రావాలన్నా అందుకు ముందు సెన్సార్ కావడం తప్పనిసరి. అలా అయ్యాకే సినిమా బిగ్ స్క్రీన్ పై పడుతుంది. అయితే కొన్ని సార్లు మాత్రం ఈ సెన్సార్ సమస్యలే ఫ్యాన్స్ కి అటు సినిమా తీసిన వారికి కూడా ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా లేకపోలేవు. ఇక కొన్ని సినిమాలకి వదిలేసిన బీప్ లు, మ్యూట్ లు మరో సినిమాలో కనిపించడంతో ఆ ద్వంద్వ వైఖరి కూడా సినిమా వీక్షకులకు అర్ధం కాదు.
అయితే ఫైనల్ గా ఈ సెన్సార్ యూనిట్ పై ప్రముఖ నిర్మాత అలాగే రచయిత కోనా వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. సెన్సార్ వాళ్ళకి కేవలం ఫలానా సినిమా ఈ సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి అనే వరకే ఉంటుంది అని సినిమాలో మార్పులు చేర్పులు చెప్పే అధికారం అయితే వారికి లేదని లేటెస్ట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
ఈ సినిమా విషయంలో తాను ఢిల్లీ వరకు వెళ్లి మరీ తన సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాను అని కూడా తెలిపారు. అలాగే ఈ సెన్సార్ సమస్యలపై మరో సమయంలో ఖచ్చితంగా ఓ మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. సో మొత్తానికి కోనా మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకొని మూవీ లవర్స్ కి బిగ్ స్క్రీన్ పై రిలీఫ్ ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు.


