రేపటి నుండి అల్లరి నరేష్ సినిమా కొత్త షెడ్యూల్ !

అల్లరి నరేష్ బిమినేని శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల వరంగల్ పరిసర ప్రాంతాల్లో పూర్తి అయ్యింది. రేపటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సునీల్ ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. మా అబ్బాయి, రంగుల రాట్నం సినిమాల్లో నటించిన చిత్ర శుక్ల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీ వసంత స్వరాలు సమకూరుస్తున్నాడు. త్వరలో ఈసినిమ టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చెయ్యబోతున్నారు. కొంత గ్యాప్ తరువాత అల్లరి నరేష్ నటిస్తోన్న ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నట్లు సమాచారం.