కోర్టును ఆశ్రయించిన మగధీర నిర్మాత..కాపీ జరిగిందా ?
Published on May 25, 2017 8:46 am IST


టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగదీర చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలు కోర్టు ని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ హిందీ సినిమా ట్రైలర్ మగధీర సినిమా కథని పోలి ఉంది.

చాలా రోజులుగా ఈ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మగధీర చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ‌ బుధవారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు మెట్లెక్కారు.

అసలు వివరాల్లోకి వెళితే ధోని సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్- కృతి సనోన్ జంటగా తెరకెక్కిన చిత్రం రాబ్తా. ప్రముఖ దర్శకుడు దినేష్ జైన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించాడు. అయితే ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి చాలామంది సేమ్ మగధీర కథను పోలి ఉందని కామెంట్ చేశారు. దీంతో నిర్మాతలు కూడా ట్రైలర్ ను చూసి కోర్టు ఇది కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని వాదన వినిపించడంతో దీనిపై కోర్టు నోటీసులు జారీ చేసి, జూన్ ఒకటికి వాయిదా వేసింది.

 
Like us on Facebook