స్పెషల్ డే నాడు అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన !

Published on Dec 29, 2018 12:58 pm IST

నాపేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. జనవరి 1 న్యూ ఇయర్ రోజున ఈ ప్రకటన వెలుబడనున్నట్లు సమాచారం. ఈ కొత్త చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కానీ లేక పరుశురాం గాని డైరెక్ట్ చేసే అవకాశం వుంది.

ఇటీవల అరవింద సమేత తో ట్రాక్ లోకి వచ్చిన త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపుతున్నాడని వార్తలు వెలుబడిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు గీత గోవిందం తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ ల లిస్ట్ లో చేరిపోయిన పరుశురాం కూడా ప్రస్తుతం బన్నీ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. మరి బన్నీ ఈ ఇద్దరి లో మొదటగా ఎవరితో సినిమా ను చేస్తాడో సస్పెన్స్ గా మారింది.

సంబంధిత సమాచారం :