డిసెంబర్ నుండి అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభం !

Published on Oct 25, 2018 8:54 am IST

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరువాత కొంత విరామం తీసుకున్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హిందీ సూపర్ హిట్ మూవీ ని రీమేక్ చేయనున్నాడట. అయితే త్రివిక్రమ్ మరో కథను కూడా వినిపించడానికి సిద్ధమవుతున్నాడట. ఈరెండు కథల్లో ఏదో ఒకటి ఫైనల్ చేసి డిసెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

బన్నీ కి త్రివిక్రమ్ తో ఇది మూడో సినిమా ఇంతకుముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక ‘అరవింద సమేత’ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ బాట పట్టారు త్రివిక్రమ్.

సంబంధిత సమాచారం :