మెగాస్టార్‌తో బన్నీని పోల్చడం సరికాదు – అల్లు బాబీ

Published on Apr 4, 2022 9:05 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో ఎదిగాడు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో మెగాస్టార్ స్టామినాను కానీ, చార్మింగ్‌ని కానీ, డాన్స్ లో ఆ గ్రేస్ ని కానీ ఎవరూ భర్తీ చేయలేకపోయారనే చెప్పుకోవాలి. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మెగాస్టార్ అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై బన్నీ సోదరుడు నిర్మాత అల్లు బాబీ స్పందించాడు.

“గని” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు బాబీ బన్నీని మెగాస్టార్ తో పోల్చడం సరికాదని అన్నాడు. చిరంజీవి స్వయం కృషితో పైకి వచ్చి మెగాస్టార్ అయ్యాడని, కానీ బన్నీ వెనుక తన తండ్రి, తాత ఉన్నారని నేను ఎప్పటికీ చిరంజీవి, అల్లు అర్జున్ లను పోల్చి చూడనని, నేనే కాదు ఫ్యామిలీలో అందరికీ చిరంజీవి గారే స్ఫూర్తి అని, అల్లు అర్జున్ కూడా ఎన్నో సార్లు ఇదే విషయాన్ని చెప్తుంటాడని అన్నారు. మనలో స్ఫూర్తిని నింపిన వ్యక్తితో మనం ఎప్పుడూ పోల్చుకోకూడదని అల్లు బాబీ అన్నాడు.

సంబంధిత సమాచారం :