మాల్దీవ్స్ కి వెళ్ళిన అల్లు అర్జున్…వీడియో షేర్ చేసిన అల్లు స్నేహ!

Published on Oct 19, 2021 12:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడు ఎక్కువ శాతం కుటుంబానికే కేటాయిస్తారు. పుష్ప చిత్రం షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం మాల్దీవ్స్ కి చేరుకున్నారు. మాల్దీవ్స్ లో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

అల్లు స్నేహ సోషల్ మీడియా లో ఒక వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ తన వెనుక ఉండి కెమెరా కి ఫోజ్ ఇస్తూ ఉన్న విడియో ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాక అల్లు అర్జున్ పక్కన ఉంటే ఏదైనా చాలా బెటర్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More