కొత్త సినిమాపై ఆగస్టు 15న అల్లు అర్జున్ స్పెషల్ భోనంజా!


అల్లు అర్జున్ హీరోగా రైటర్ వక్కంతం వంశీ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా నా పేరు సూర్య ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభింది. ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా చేసే పనిలో అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై కొత్త విషయం చెబుతున్నాడు. మరో 13 రోజుల్లో సినిమాకి సంబంధించి ఫాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నాడట.

అవును.. ‘నా పేరు సూర్య’ సినిమాకు సంబంధించి ఒక గిఫ్ట్ ఏదో ఆగస్టు 15న వస్తోందట. విశాల్-శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక సైనికుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా కనిపిస్తున్నాడు. దాని కోసం ఇప్పటికే భారీగా కసరత్తు చేస్తున్నాడు. మరి ఆగస్ట్ 15 న అల్లు అర్జున్ ని సినిమాకి సంబంధించి ఎలాంటి గిఫ్ట్ ప్రేక్షకులకి అందుతుందో వేచి చూడాల్సిందే.