Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో హైలెట్స్ ఇవే !
Published on Nov 15, 2018 12:33 am IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ చిత్రం ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రోమోలు చూస్తుంటే.. శ్రీను వైట్ల తన దర్శకత్వ శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. .

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ యంగ్ కమెడియన్ పెర్ఫార్మెన్స్ మరియు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలెట్ గా నిలుస్తాయట. దూకుడులో బ్రహ్మానందం కామెడీ ఏ రేంజ్ లో పేలిందో.. మళ్లీ ఆ స్థాయిలో కామెడీని ఈ సినిమాలో కమెడియన్ సత్య నుండి శ్రీను వైట్ల రాబట్టుకున్నట్లు సమాచారం. అలాగే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుందట. హీరోకి మరియు అతని తల్లికి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలను తమన్ తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో, వాటిని మరో స్థాయిలో నిలబెట్టారట.

ఇక ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :