సమీక్ష : అమర్ అక్బర్ ఆంటొని – ఆకట్టుకోని రివెంజ్ డ్రామా

సమీక్ష : అమర్ అక్బర్ ఆంటొని – ఆకట్టుకోని రివెంజ్ డ్రామా

Published on Nov 17, 2018 10:55 AM IST
Amar Akbar Anthony movie review

విడుదల తేదీ : నవంబర్ 16, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రవితేజ, ఇలియాన, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు.

దర్శకత్వం : శ్రీను వైట్ల

నిర్మాత : నవీన్ యర్నెని, వై రవి శంకర్ , సివియమ్.

సంగీతం : యస్ తమన్

స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత నవీన్ యర్నెని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:
రవితేజ (అమర్) – ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్‌ మంచి ఫ్రెండ్స్. న్యూయార్క్‌ లో కలిసి బిజినెస్ చేస్తుంటారు. తమ కంపెనీలో పని చేసే నలుగురు ఎంప్లాయిస్ (విలన్ )కి, తమ కంపెనీలో ట్వంటీ పర్సెంట్ షేర్ ఇచ్చి.. వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేస్తారు. కానీ వాళ్లు అమర్ , ఐశ్వర్య పేరెంట్స్ ని దారుణంగా చంపేస్తారు. అయితే వారి నుండి అమ‌ర్- ఐశ్వ‌ర్య‌లు మాత్రం త‌ప్పించుకుంటారు. ఆ తరువాత అమ‌ర్ ఆ నలుగురు పై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ క్ర‌మంలో అమర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధ పడుతూ ఉంటాడు. ఆ డిజార్డర్ అమర్ పై ఎలాంటి ప్రభావం చూపింది. అసలు అక్బర్, ఆంటోనీ ఎవరు ? వాళ్లకి అమర్ కి ఏమిటి సంబంధం.. చివరికి అమర్ మిగిలిన ఆ నలుగురుని అమర్ ఎలా చంపుతాడు. చిన్న‌త‌నంలో దూరమయిన ఐశ్వ‌ర్య‌ను అమర్ మళ్ళీ ఎలా క‌లుసుకుంటాడు..? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలసిందే.
 

ప్లస్ పాయింట్స్ :

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. రవితేజ తన ఎనర్జీ పెర్ఫార్మన్స్ తో పాటు తన టైమింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఇక లుక్స్ పరంగా గత తన సినిమాలలో కంటే.. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

హీరోయిన్ పాత్రలో నటించిన ఇలియానా చాలా బాగా నటించింది. పూజ పాత్రలో తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి.

మరో ముఖ్య పాత్రలో కనిపించిన సునీల్ కూడా తన టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే జూనియర్ పాల్ గా నటించిన కమెడియన్ సత్య కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక ఇతర కామిక్ పాత్రల్లో కనిపించిన శ్రీనివాస్ రెడ్డి, రఘు బాబు, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్ రెడ్డి తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేసారు.

దర్శకుడు శ్రీను వైట్ల ఈ సారి తన శైలి కి భిన్నంగా ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమాని మలిచే ప్రయత్నం చేసారు. ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ నడిపారు.
 
మైనస్ పాయింట్స్ :

దర్శకుడు శ్రీను వైట్ల డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు.

దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ విలన్ ని చంపటానికి హీరో పెద్ద బిల్డింగ్ ఎక్కి వెళ్లడం మరీ సినిమాటిక్ గా ఉంది. పైగా చాలా సన్నివేశాలు ఆడియన్స్ ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. దీనికి తోడు కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవలేదు.

పైగా కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం, కామెడీ కూడా పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
 
సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. శ్రీను వైట్ల మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.

ఇక యమ్ అర్ వర్మ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
 
తీర్పు:

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా సాగలేదు. అయితే రవితేజ తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇలియాన నటన కూడా చాలా బాగుంది. ఇక సత్య , సునీల్ తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తారు.

ఇక దర్శకుడు శ్రీను వైట్ల మంచి వైవిధ్యమైన స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ కు తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. సినిమాలో ముఖ్యమైన హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా సాగవు. పైగా కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కామెడీ కూడా పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు