“అర్జున ఫాల్గుణ”లో గ్రామ వాలంటీర్ గా అమృత సూపర్బ్ గా చేసిందట?

Published on Dec 29, 2021 9:02 pm IST

ఈ వారం అలాగే ఈ ఏడాది కి చిట్ట చివరి సినిమాగా రిలీజ్ కాబోతున్న లేటెస్ట్ సినిమా “అర్జున ఫాల్గుణ”. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన మరో సినిమా ఇది. అలాగే ఈ ఏడాదిలో రిలీజ్ అవుతున్న తన హ్యాట్రిక్ సినిమా ఇది. తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా యువ హీరోయిన్ అమృత అయ్యర్ నటించింది.

అయితే ఆమె రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు తెలియజేసాడు. అమృత ఈ చిత్రంలో ఒక గ్రామ వాలంటీర్ గా కనిపిస్తుంది అని, ఈ పాత్రలో ఆమె సూపర్బ్ గా చేసింది అని అంతే కాకుండా ఆమె రోల్ లో చాలా ఫన్ కూడా ఉంటుంది అని తెలిపాడు. సినిమాలో కూడా తన రోల్ కూడా కీలకంగా ఉంటుందని తెలిపాడు. మరి ఆమె రోల్ ఎంత ఫన్ గా ఉంటుందో తెలియాలి ఆంటీ ఈ డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :