వైరల్ వీడియో : రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్ అదరగొట్టిన ఆనంద్ మహీంద్రా

Published on Feb 11, 2023 9:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో రూపొందిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి అందరినీ అలరించారు. అటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ ని భారీ స్థాయి కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులని సైతం దక్కించుకుంది.

కాగా విషయం ఏమిటంటే, ప్రస్తుతం హైదరాబాద్ లో ఫార్ములా ఈ ప్రిక్స్ రేస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని చూడడానికి అటు అనేకమంది ప్రజలతో పాటు పలువురు సెలెబ్రిటీలు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సరదాగా ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు స్టెప్ ని వేసి సందడి చేసారు మహీంద్రా గ్రూప్ చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా. అనంతరం ఆర్ఆర్ఆర్ లోని ఈ సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వాలని కోరుతూ టీమ్ కి ఆయన ముందస్తుగా అభినందనలు తెలిపారు. కాగా చరణ్ తో తాను వేసిన ఈ స్టెప్ తాలూకు వీడియోని ఆనంద్ మహీంద్రా స్వయంగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :