ఒకేరోజు ఇద్దరు మెగా హీరోల సినిమాలు కవర్ చేసేసిన శ్రీముఖి.!

Published on Feb 26, 2022 11:13 am IST

తెలుగు బుల్లితెర దగ్గర మంచి ఫేమస్ అయ్యినటువంటి యంగ్ ఫీమేల్ యాంకర్స్ లో మాస్ యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా అనేక సినిమాల్లో కూడా నటిస్తూ వెళ్తుంది. మరి లేటెస్ట్ గా ఆమె పెట్టిన లేటెస్ట్ పోస్ట్ మంచి ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో ఒకటైన “భోళా శంకర్” సినిమాలో ఈమె కూడా నటిస్తున్నట్టుగా నిన్న కన్ఫర్మ్ చేసింది.

అలాగే నిన్ననే ఈ సినిమా షూట్ లో కూడా పాల్గొన్నట్టు తెలిపింది. ఇక అలాగే మరోపక్క ఇదే రోజు అటు మెగా స్టార్ సినిమా షూట్ కంప్లీట్ చేసుకున్నాక మరో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “భీమ్లా నాయక్” సినిమాని తమ దర్శకుడు మెహర్ రమేష్ తో కలిసి చూసినట్టుగా ఆ స్నాప్స్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మొత్తానికి ఇలా అయితే ఆమె ఒకే రోజులో ఇద్దరు మెగా హీరోల సినిమాలను కవర్ చేసేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :