12 కోట్లకు అమ్ముడైన రజినీ “అన్నాత్తే” తెలుగు డబ్బింగ్ రైట్స్!

12 కోట్లకు అమ్ముడైన రజినీ “అన్నాత్తే” తెలుగు డబ్బింగ్ రైట్స్!

Published on Oct 12, 2021 3:40 PM IST


రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రం లో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అంతేకాక ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజినీ కాంత్ ఈ చిత్రం తో సూపర్ హిట్ కొడతారు అనే గట్టి నమ్మకం తో తెలుగు లో డబ్బింగ్ రైట్స్ భారీ ధరకి కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 12 కోట్ల రూపాయల తో తెలుగు రైట్స్ ను కొన్నట్లు తెలుస్తోంది.

డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం బాలయ్య అఖండ తో పోటీ లో ఉండే అవకాశం ఉంది. త్వరలో ఈ చిత్రం నుండి టీజర్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు