ప్రభాస్ తో మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ కి రంగం సిద్ధం!

Published on Sep 11, 2021 2:00 pm IST

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్లాన్ ప్రకారం “ఆదిపురుష్” మరియు బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” ని ఫినిష్ చేసే పనిలో ప్రభాస్ పడ్డాడు. అయితే ఇప్పుడు సలార్ పైనే లేటెస్ట్ ఇన్ఫో వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఇప్పటికే కొంత మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నీల్ అదిరే యాక్షన్ సీక్వెన్స్ లతో నింపేసాడు. ఇప్పటికే పలు సాలిడ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఇది బహుశా ఇంటర్వెల్ బ్లాక్ బ్యాంగ్ అని కూడా టాక్ ఉంది. మేకర్స్ ఇపుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :