మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి మరో హీరో రాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి నిహారిక, ప్రస్తుతం మొదటి సినిమా చేస్తున్న చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ లను కలుపుకుని మొత్తం పది మంది స్టార్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు 11వ వారసుడిగా చిరు మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వెండి తెర అరంగేట్రానికి సిద్దమవుతున్నారట.

ఇతన్ని ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ సినిమాను నిర్మిస్తున్న సాయి కొర్రపాటి లాంచ్ చేస్తారని అంటున్నారు. అలాగే ఈ సినిమాను శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తారని కూడ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత మేరకు వాస్తముందో తేలాలంటే మెగా కాంపౌండ్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.