టాక్..”టిల్లు స్క్వేర్” కి మరో హీరోయిన్.?

టాక్..”టిల్లు స్క్వేర్” కి మరో హీరోయిన్.?

Published on Dec 8, 2022 10:01 AM IST

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలు అందించి పెట్టిన హిట్ చిత్రాల్లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రం “డీజే టిల్లు” కూడా ఒకటి. మరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అయితే ఓ మినీ సెన్సేషన్ ని యూత్ లో సెట్ చేసింది. ఇక దీనితో నెక్స్ట్ డీజే టిల్లు పార్ట్ 2 పై అనేక అంచనాలు సెట్ కాగా ఈ సినిమాకి హీరోయిన్స్ విషయంలో మాత్రం కాస్త గందరగోళంగా ఉందని చెప్పాలి.

మొదట శ్రీ లీల అనుకోగా నెక్స్ట్ ఆ పేరు అనుపమకు మారింది. తీరా చూస్తే ఈమె బయటకి రాగా ఫైనల్ గా మడోనా సెబాస్టియన్ పేరు ఫైనల్ అయ్యింది అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందట. రీసెంట్ గానే ఈ హీరోయిన్ హిట్ 2 తో మంచి హిట్ ని అందుకుంది. మరి ఈ సినిమా విషయంలో ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు