విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఐతే, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తన కెరీర్ లోనే భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి రెగ్యులర్ మాస్ హీరోగా కాకుండా, భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించనున్నాడు. పైగా ఫాదర్–సన్ ఎమోషన్ తో సాగే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయట. కాగా సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఈ ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ పాత్ర చుట్టూ ఫుల్ యాక్షన్ డ్రామా ఉంటుందట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. అన్నట్టు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.


