‘శైలజారెడ్డి అల్లుడు’లో తన రోల్ ఏంటో రివీల్ చేసిన అను ఇమ్మాన్యుయేల్ !
Published on Jun 11, 2018 9:20 am IST

ఈ ఏడాది పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కనిపించిన నటి అను ఇమ్మాన్యుయేల్ ప్రసుతం నాగ చైతన్య చేస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’లో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా గురించి అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ఇందులో తన పాత్ర ఈగోయిస్టిక్ గా ఉంటుదని తెలిపారు.

అలాగే తన కెరీర్లో ఈ క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండటమేగాక సినిమా చూసే వారికి కొత్తగా అనిపిస్తుందని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మారుతి గత చిత్రం ‘మహానుభావుడు’ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook