‘అనుభవించు రాజా’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్..!

Published on Nov 27, 2021 7:42 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ “అనుభవించు రాజా”. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే ఈ వారంలో పెద్ద సినిమాలేమి లేకపోవడంతో “అనుభవించు రాజా” కలెక్షన్స్‌ పరంగా పర్వాలేనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 450కి పైగా థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజే రూ.70 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.4 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్‌లో కనుక భారీగా వసూళ్లను రాబడితే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించే అవకాశం ఈజీ అవుతుంది.

సంబంధిత సమాచారం :