లేటెస్ట్ : అనుష్క 48 టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

Published on Mar 1, 2023 12:16 am IST


టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కథానాయికలుగా మంచి క్రేజ్ తో పలు సక్సెస్ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్న వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. ఇటీవల ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాల్లో దేవసేన పాత్ర పోషించి తద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకాభిమానుల నుండి మరింత గొప్ప పేరు సొంతం చేసుకున్నారు అనుష్క శెట్టి. ఇక ఆ తరువాత ఆమె నటించిన భాగమతి మూవీ పెద్ద సక్సెస్ అందుకోగా, అనంతరం వచ్చిన నిశ్శబ్దం పర్వాలేదనిపించింది.

ఇక తాజాగా నవీన్ పోలిశెట్టి తో కలిసి అనుష్క తన కెరీర్ 48వ సినిమా చేస్తున్నారు. యువ దర్శకడు పి మహేష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీలో చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క కనిపించనుండగా ఇటీవల రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి స్పందన లభించింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క టైటిల్ ని రేపు రిలీజ్ చేయబోతున్నట్లు నేడు నవీన్ పోలిశెట్టి ద్వారా ఒక సరదా వీడియో బైట్ రిలీజ్ చేసారు మేకర్స్. కాగా రాధన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి నీరవ్ షా ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :