ఆఫీషియల్ : తన హిట్ బ్యానర్లో అనుష్క మోస్ట్ అవైటెడ్ చిత్రం

Published on Nov 7, 2021 9:31 am IST

ప్రెజెంట్ జెనరేషన్ మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్స్ లో చెక్కు చెదరకుండా ఉండే పేరు అనుష్క. అసలు ఓ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా ఎంత బలంగా ఉంటుందో హీరోయిన్ పై సినిమా తీసినా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఈమె సినిమాలే నిదర్శనం. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా దగ్గరే తన ముద్ర వేసుకొని అపారమైన క్రేజ్ ని అనుష్క సంపాదించుకుంది.

మరి ఈరోజు స్వీటీ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మరి ఈ స్పెషల్ డే న తన అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనుష్క కొత్త ప్రాజెక్ట్ ఈరోజు అనౌన్స్ అయ్యింది. తన కెరీర్ లో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్ లోనే అనుష్క హ్యాట్రిక్ సినిమా ఇపుడు అధికారికంగా అనౌన్స్ అయ్యింది.

“మిర్చి”, “భాగమతి” లాంటి తర్వాత అనుష్క వీరి బ్యానర్ నుంచి ఓ విని చాలా ఇంప్రెస్ అయ్యిందట. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను వీరితో చేయడానికి సిద్ధం అయ్యింది. మరి ఈ చిత్రాన్ని ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వం వహించనుండగా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఫైనల్ గా స్వీటీ అనుష్క కి మా 123తెలుగు యూనిట్ కూడా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం :

More